గుంటూరు రెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి సాధారణ విద్యార్థిని టాప్ స్టూడెంట్స్ లో కలపడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై అనేక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం బుధవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.