గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్‌: హోంమంత్రి అనిత

70பார்த்தது
గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్‌: హోంమంత్రి అనిత
గతంలో వైసీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామని, గత ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி