రామచంద్రపురం: విఆర్ కు సీఐ అశోక్ కుమార్?
రామచంద్రపురంలో గురువారం జరిగిన శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో కుల ప్రసంగం చేసిన సీఐ కె. అశోక్ కుమార్ ను విఆర్ఓకి పంపినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ యూనిఫాంలో సమారాధనకు హాజరై భవిష్యత్తు మన కులానిదే అనే విధంగా ప్రసంగించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అంతేకాకుండా ఎక్కడో ఉన్న తనను రామచంద్రపురం సిఐ గా నియమించిన వారికి ధన్యవాదాలు చెప్పడం కొస మెరుపు.