రామచంద్రాపురం: సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ఇంజినీరింగ్, పర్మినెంట్ కార్మికులుగా పనిచేస్తున్న వారి దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా.. రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. శ్రామికుల శ్రమ దోపిడీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.