పిఠాపురం: అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేద్దాం
పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది అధిక సంఖ్యలో తెదేపా సభ్యత్వాలు నమోదు చేయిద్దామని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి తెదేపా కార్యాలయంలో ఆయన నాయకులతో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 26 నుంచి సభ్యత్వాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో 60 లక్షలకు పైగా సభ్యత్వాలు చేశామని గుర్తుచేశారు. వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ల ద్వారా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.