పిఠాపురం: హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలి
జనవరి 5న విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో సమావేశం జరిగింది. తితిదే లడ్డూ అపవితత్రపై జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. హిందువుల విశ్వాసాలతో ఆటలాడే ధోరణి మానుకోవాలని, ప్రభుత్వం నుంచి దేవాలయాలకు విముక్తి కలిగేలా పోరాడదామన్నారు.