పెదపూడి: బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
పెదపూడి మండలం అచ్యుతాపురత్రయంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నిరస్రాయులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధితులకు, నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం అందజేశారు.