నవంబర్ 22 న సఖినేటిపల్లిలో జరిగే జిల్లా స్థాయి కౌలు రైతుల సదస్సును జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన కేశవశెట్టి పిలుపునిచ్చారు. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో శుక్రవారం జరిగిన కౌలు రైతుల మండల సమావేశంలో ఆయన పాల్గొని కౌలు రైతు సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కేశవశెట్టి డిమాండ్ చేశారు.