సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని కాకినాడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డివివి రమేష్ బాబు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు తొలిత ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.