రాజోలు మండల పరిషత్ కార్యాలయం నందు ఆదివారం ఉదయం 10: 30 గంటలకు ఎంపీపీ కేత శ్రీనివాస్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో రాంబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవప్రసాద్ పాల్గొంటారు అన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.