రాజోలు మండలం పొన్నమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని సచివాలయ ఉద్యోగులు తనిఖీ చేశారు. ఈ మేరకు భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పాటించాలని సూచించారు. విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.