సమస్యలపై శంఖారావం పేరిట రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాజోలు నియోజకవర్గంలోని సమస్యలపై తనకు ఫోన్ చేస్తే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు. తన వాట్సప్ కు సమస్యపై ఫోటో కానీ వీడియో కానీ పంపించాలని ఆయన సూచించారు.