సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. వేకువజామున నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు వద్ద మహిళలు, భవాని మాలధారణ భక్తులు దీపాలు వెలిగించి పూజ నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.