రాజోలు మండలం తాటిపాక గ్రామ పంచాయతీ కార్యదర్శిగా తాడి ఏసుబాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పూర్ణచంద్రరావు బాధ్యతలు నిర్వహించారు. రెగ్యులర్ కార్యదర్శిగా తాడి ఏసుబాబు నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజల సహకారంతో పారిశుద్ధ్య నిర్వాహణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.