రామచంద్రపురం: అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాలి
అభివృద్ధి సంక్షేమం విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సుభాష్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెలంపాలెం, నున్న వారివీధి, ద్రాక్షారామ, బాలాంత్రం, కోలంక గ్రామాల్లో జరిగిన శంకుస్థాపనలో పాల్గొన్నారు.