వినాయకుడి నిమజ్జనాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రపురం పట్టణంలోని 4వ వార్డులో నెలకొల్పిన గణనాథుడిని మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం దర్శించుకొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.