రామచంద్రపురం నియోజవర్గం పరిధిలోని కాజులూరు మండలంలో మంగళవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించనున్నారు. గొల్లపాలెం కొత్తపేట కాలనీలో ఉపాధి హామీ పథకం కింద రూ. 25 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు అంగర కృష్ణ గౌడ్ తెలిపారు.