మండపేట నియోజకవర్గం పరిధిలోని ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి మందు గుండు సామాగ్రి పేలుడు ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి. సుభాష్ మంగళవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో కొల్లు వెంకటకృష్ణ మృతి చెందగా, అతని భార్య జయ శ్రీ, తల్లిదండ్రులు గాయపడ్డారు.