అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామానికి చెందిన మల్లాడి లక్ష్మి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న వాసంశెట్టి సుభాష్ బాధితురాలని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.