లోక కళ్యాణార్ధమే తాను దేవాలయాలను సందర్శిస్తున్నట్లు మహిళా అఘోరి తెలిపారు. రామచంద్రపురం నియోజక వర్గం పరిధిలోని ద్రాక్షారామం లో బుధవారం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. గో హత్యలు ఆపాలని, ఆడపిల్లల పై దాడులు అరికట్టాలని, దేవాలయాలపై దాడులు ఆపాలని కోరారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి లేదంటే మీ సీట్లకు ముప్పు ఖాయమన్నారు.