కాజులూరు మండలం దుద్దుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన (63 కెవి) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదగా బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సరఫరా చేసే విద్యుత్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.