రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని హసన్ బాద గ్రామంలో సీజనల్ జ్వరాలను నివారించేందుకు సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు, ఆరోగ్య సిబ్బంది మంగళవారం రాత్రి ఫాగింగ్ చేపట్టారు. దోమల మందు, బ్లీచింగ్ స్ప్రే ద్వారా ఈ చర్యలు తీసుకోగా, సర్పంచ్ సతీష్ రావు ప్రజలను పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎం. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.