తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి వాసంశెట్టి సుభాశ్ శనివారం సందర్శించారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం మంత్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు సుభాశ్కు స్వామివారి ఆశీస్సులు అందించారు. స్వామి వారి చిత్రపటంతో పాటు, ప్రసాదాలను అందజేశారు.