తెలుగుదేశం పార్టీ వీరాభిమాని గంజా రమణకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం కొత్త సైకిల్ ను బహుకరించారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ముచ్చిమిల్లి గ్రామానికి చెందిన గంజా రమణ తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈయన పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేస్తారు. పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తారు. దీంతో మంత్రి సుభాష్ అభిమానంతో సైకిల్ ను బహుకరించారు.