దళితుల అభివృద్ధి బీజేపీ లక్ష్యం: ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు

241பார்த்தது
దళితుల అభివృద్ధి బీజేపీ లక్ష్యం: ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు
బీజేపీ పార్టీతోనే దళితులకు అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన ఎస్సీ మోర్చా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దేవానంద్ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని దళితులంతా ఒకే తాటిపై ఉండాలని కలిసి సంఘటిత శక్తిగా ఎదగాలని మరింత బలోపేతం అవ్వాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరింత ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం నియోజవర్గం నుంచి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెయ్యిల రాంబాబు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా గుడిసె దేవానంద్ మొదటిసారిగా రాజమండ్రి విచ్చేసిన ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ఆయన నియామకం పట్ల ఎస్సీ మోర్చా నాయుకులలో కొత్త ఉత్సాహం నెలకొందని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో ఎస్సీ మోర్చా మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி