రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారి కుటుంబాలతో మాట్లాడి ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యం & ఆర్థిక ప్రోత్సాహకాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.