రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి తక్షణం అమలు చేయాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం కోరుకొండలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.