రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.