ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, రైతులు సొంతంగా చదువుకుని అవగాహన పొందడానికి వీలు కల్పించే పుస్తక, ఇతర సాధనాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సంక్షిప్త మార్గదర్శిని విడుదల చేశారు.