సీతానగరం మండలం పరిధిలోని వంగలపూడి ఇసుక ర్యాంపును జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ఎగుమతులను ఎవరు అడ్డుకోవద్దని అధికారులకు తెలిపారు. ఆదేశాలను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని, ఇసుక ఎగుమతులు నిర్ధారించిన ధరలకు లోబడి ఉంటాయని, ర్యాంపుల్లో చట్ట విరుద్ధంగా అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.