రాజానగరం మండలం నందరాడ సొసైటీలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని రైతుల సొమ్ము దారి మల్లించారని గ్రామానికి చెందిన ఆళ్ళ శివ నాగరాజు, అడబాల గణపతి అన్నారు. దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల బాబీ, వాకచర్ల విష్ణుమూర్తి, అడబాల రామకల్యాణి తదితరులు పాల్గొన్నారు.