తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముని కూడలి ఘాట్ ను యాత్రికులు సందర్శించే విధంగా ఆధునీకరించాలని.. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాలు యాక్షన్ ప్లాన్ పై మంగళవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతానగరం ప్రాంతంలో 8 పుష్కర ఘాట్లు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలన్నారు.