విద్యార్థులకు అత్యుత్తమ భవిష్యత్తు అందించడం కోసం ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాజనగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు అవశ్యకత గురించి వివరించారు.