రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం రాజానగరం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. గతంలో ఉన్నప్పటికీ కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా కొత్తగా ఓటర్ నమోదుకు ఈ నెల 6వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు.