కోరుకొండ సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ మంగళవారం తెలిపారు. గంజాయి, సారా రవాణా, పేకాట, గుండాట, కోడి పందాలు వంటి వాటిపై సమాచారం అందిస్తే దాడులు నిర్వహిస్తామని, బహుమతులు అందజేస్తామని అన్నారు. సైబర్ నేరాలకు ప్రజలు గురి కాకూడదని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.