రాజానగరంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గురువారం రాజానగరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ కోసం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఆర్. జె. డి సత్యనారాయణ మూర్తితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏయూ అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.