రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సోమవారం రాజానగరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని అన్నారు. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం బకాయిలను చెల్లించామని అన్నారు. అదేవిధంగా మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.