టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ, "జగన్ లక్షల కోట్లు తినేసి, 12 ఏండ్లుగా ఈడీ, సీబీఐ కేసుల్లో తప్పించుకుంటున్నారు. అదానీకి రాష్ట్ర సంపద అప్పగించి, 7వేల మెగావాట్ల పవర్ కాంట్రాక్టుకు లంచం తీసుకున్నారని ఆరోపించారు. కాగా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు.