కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నేతలకు, దళారులకు ఉపయోగపడుతుందని పేద ప్రజలకు ప్రయోజనం కలగట్లేదని తూ. గో. జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉచిత ఇసుక విధానంలోని అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.