కడియం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా గురువారం తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, దక్షిణ మండల డిఎస్పీ ఎస్. భవ్య కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు.