తూ. గో జిల్లాలో ప్రజలకు మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచే కార్యక్రమాలను అధికారులు నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. అపరిశుద్ధ్య వాడలను శుభ్రపరిచే పారిశుధ్య కార్మికులకు సేవలు ఎనలేనివని కలెక్టర్ అన్నారు. పారిశుద్ధ్యం పై అధికారులకు సూచనలు చేశారు.