కాకినాడ రూరల్ మండలంలోని ఎన్నికలు జరగని 6 గ్రామపంచాయతీలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృషితో స్టాంప్ డ్యూటీ నిధులు విడుదలయ్యాయని కాకినాడ రూరల్ మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గ్రామ పంచాయతీలకు నిధులు రావడం జరిగిందన్నారు.