రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సదుపాయాలపై సూపరింటెండెంట్ సూర్య ప్రభతో చర్చించారు. రోగులకు మెరుగైన చికిత్సా విధానం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.