తూ. గో జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలలో టీబీ
పరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. శనివారం రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం వద్ద టీబీ ఫోరం, సొసైటీ, టీబీ ముక్త్ గ్రామపంచాయతీ అవార్డు ప్రధాన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాకు చెందిన 109 పంచాయతీలకు టీబీ ముక్త్ కింద గాంధీ బ్రాంజ్ మెడల్, సర్టిఫికెట్లు అందించడం ద్వారా వారికి మరింత బాధ్యత పెరిగిందన్నారు.