మాజీ ఎంపీ భరత్ రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోరంపూడి ఫ్లైఓవర్ మీద లైట్లు లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం లేదని భరత్ విమర్శించడాన్ని రెడ్డి మణి తప్పుపట్టారు. ఫ్లైఓవర్ అబ్జర్వేషన్ లో ఉందని, అది పూర్తయితే లైట్లు, రోడ్డు స్కట్స్ అన్నీ వస్తాయన్నారు.