కందుకూరి రాజ్యలక్ష్మి 174వ జయంతి వేడుకలు మంగళవారం రాజమండ్రి ఆనంద గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని కందుకూరి దంపతుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. కందుకూరి వీరేశలింగం తలపెట్టిన సంఘ సంస్కరణలకు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి బాసటగా నిలిచారన్నారు. భర్త అడుగుజాడలను అనుసరించి సమాజానికి సేవ చేసిన ఆమె జయంతిని స్త్రీ సాధికార దినోత్సవంగా జరుపుకోవాలన్నారు.