తూ. గో జిల్లాలోని సోషల్ మీడియా ప్రతినిధులతో ఎస్పీ నర్సింహ కిషోర్ మంగళవారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం, లాభాలు, నష్టాలు, వాస్తవ పరిస్థితులపై చర్చ జరిగింది. పలువురు ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. యువతపై సోషల్ మీడియా ఏ మేరకు ప్రభావితం చూపుతోందో? ఇతర వాస్తవ విరుద్ధమైన అంశాలపై ఎస్పీ సోషల్ మీడియా ప్రతినిధులకు వివరించారు.