రాజమండ్రిలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల వద్ద ఈనెల 14వ తేదీన అప్రెంటీస్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రధాన అధికారి ఎల్. ఆర్ కృష్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటిఐ పాస్ అయిన విద్యార్థులు అన్ని ట్రేడ్స్ వారు అప్రెంటిస్ మేళాకు హాజరు కావచ్చు అని తెలియజేశారు.