తూ. గో జిల్లాలో లైసెన్సు కలిగిన వారు మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ, విక్రయాలు చేయాలని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచించారు. శనివారం రాజమండ్రిలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.