రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ రామచంద్ర మంగళవారం తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నా, 2023లో డిగ్రీ పాసైనా, 2024లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాలో పది కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు.